Thursday, January 23, 2025

ఇక కారు.. తుక్కు తుక్కే : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రధాని మోడీ పాలనలోని డబుల్ ఇంజిన్ సర్కార్ బిఆర్‌ఎస్ కారును తుక్కు తుక్కుగా చేస్తుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం బిఆర్‌ఎస్ పార్టీలలు పైకి శత్రువులుగా నటిస్తూ ఢిల్లీలో మాత్రం దోస్తీ చేస్తున్నారని సంజయ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బిఆర్‌ఎస్‌కు వేసినట్లేనని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఇన్ని రోజులు విస్మరించిన సర్కార్.. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వంలో విలీనం చేసిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు కేటాయించిన నిధులను సైతం దారిమళ్లించిన సర్కార్.. బిఆర్‌ఎస్ సర్కార్ అని  ఆయన విరుచుకుపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News