Friday, January 10, 2025

హెరిటేజ్ వాక్ పునఃప్రారంభం

- Advertisement -
- Advertisement -

Heritage walk started in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా గత సోమవారం 18వ తేదీన దక్కన్ హెరిటేజ్ అకాడమీ సంస్థ., జిహెచ్‌ఎంసి, ఎయస్‌ఐ, టూరిజం, హెరిటేజ్ తెలంగాణ మొదలైన ప్రభుత్వ సంస్థల సహకారంతో ప్రత్యేక హెరిటేజ్ వాక్‌ను నిర్వహించింది. ఈ నెల 24 సోమవారం నుండి క్రమం తప్పకుండా కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తోంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వారాంతరాలైన ప్రతి ఆదివారం, ప్రతి రెండవ శనివారం ఈ హెరిటేజ్ వాక్ లను నిర్వహించిన దక్కన్ సంస్థ, కోవిడ్ ధాటికి 2020 మార్చి నుండి నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితులు సద్ధుమణగడంతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమాలను పునుఃప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర పోలీస్ శాఖ, సిటీ కాలేజ్, హైకోర్టు, ఉస్మానియా హాస్పిటల్, చౌమహల్లా ప్యాలెస్, కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మొదలైన వివిధ సంస్థల సౌజన్యంతో ఈ హెరిటేజ్ వాక్‌లను దక్కన్ హెరిటేజ్ అకాడమీ సంస్థ నిర్వహించనుంది. పర్యాటకులు, సందర్శకులందరూ హెరిటేజ్ వాక్ కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిస్తూ, అధికారికంగా నామమాత్రపు రుసుమును రూ.100/- గా నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News