- Advertisement -
కోలీవుడ్ హీరో అజిత్ (కుమార్) మంచి బైక్, కారు రేసర్ అన్నది విదితమే. అయితే, దుబాయి రేసింగ్ ఈవెంట్‌లో అజిత్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బ తిన్నది. అజిత్ క్షేమంగా బయట పడ్డారు. దుబాయిలో 24హెచ్2015 ఎండ్యూరెన్స్ రేస్ జరగనున్నది. ఈ రేసింగ్ ఈవెంట్ ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నారు. దీనిలో అజిత్ కూడా పాల్గొంటున్నారు. అందు కోసం ఆయన మంగళవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో రేసింగ్ ట్రాక్‌పై ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్‌పై అజిత్ కారు దూసుకుపోతుండగా ఉన్నట్లుండి అదుపు తప్పింది, కారు గోడను ఢీకొని గిర్రున తిరుగుతూ నిలచిపోయింది. ఈవెంట్ భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అజిత్‌ను మరొక వాహనంలో అక్కడి నుంచి తరలించారు.
- Advertisement -