Sunday, February 23, 2025

మరోసారి ప్రమాదానికి గురైన అజిత్ కారు.. ఏం జరిగిందంటే..

- Advertisement -
- Advertisement -

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కి రేసింగ్ అంటే ఎంత ఇష్టమే అందరికి తెలిసిందే. తన సినిమాల్లో వచ్చే ఛేజింగ్ సీన్లలోనూ ఆయన డూప్ లేకుండా యాక్ట్ చేస్తారు. ఇక సినిమా షూటింగ్‌లు లేని సమయంలో రేస్‌లలో పాల్గొంటారు. అయితే తాజాగా అజిత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే ఈ ప్రమాదంలో అజిత్‌కు ఏమీ కాలేదు అని ఆయన రేసింగ్ టీం తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రమాదంలో హీరోకి ఏం కాలేదు అని.. అసలు ప్రమాదానికి కారణంగా ఇతర కారు వల్లే అని స్పష్టం చేసింది. అయితే జనవరి నెలలోనూ అజిత్‌ ఇలాగే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ ప్రాక్టీస్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కానీ, ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయపడ్డారు. ఇక అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిషా హీరోయిన్. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News