Tuesday, April 15, 2025

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నుంచి అద్భుతమైన ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్ హీరోగా నిర్మించిన మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. టి- సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో అజిత్‌ను డిఫరెంట్ అవతార్స్‌లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో చూపించిన ట్రైలర్ అదిరిపోయింది. తన కొడుకును కాపాడుకోవడానికి వయోలెంట్‌గా కనిపించే అజిత్ క్యారెక్టరైజేషన్ చాలా ఆసక్తిని పెంచింది. భయాన్నే భయపెడతాడనే డైలాగ్ హీరో క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా వుండబోతోంది సూచిస్తోంది. ట్రైలర్‌లో అద్భుతమైన విజువల్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ అజిత్ అభిమానులను కట్టిపడేశాయి. ట్రైలర్‌లో త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News