Thursday, March 13, 2025

హీరో అల్లు అర్జున్ కు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలన్న నిబంధననుంచి అర్జున్ కు కోర్టు మినహాయింపు ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు మినహాయింపు కోరారు. మరోవైపు అల్లు అర్జున్‌కు విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఫుష్ప2 ప్రీమియర్ సంందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఎ11గా చేర్చుతూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News