Monday, December 23, 2024

మొక్కలు నాటిన ‘హీరో’ సినిమా బృందం

- Advertisement -
- Advertisement -

'Hero' film crew planted Plants

 

మనుషులకి, మొక్కలకు మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అని యంగ్ హీరో అశోక్ గల్లా అభిప్రాయపడ్డారు. ఆయన హీరోగా నటించిన ‘హీరో’ సినిమా విడుదలవుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, జిహెచ్‌ఎంసి పార్క్‌లో కథానాయిక నిధి అగర్వాల్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్ల ఇప్పటికే ఈ భూమిపై అనేక విపత్తులు సంభవిస్తున్నాయని, అది ఆగాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆయన సూచించారు.

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లాంటి కార్యక్రమాన్ని రూపొందించి, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి కృషి మరింత ముందుకు సాగాలంటే విధిగా ప్రతి ఒక్కరూ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగం కావాలని, విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ పాల్గొని వృక్షవేదం పుస్తకాన్ని సినిమా బృందానికి అందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News