Friday, November 22, 2024

హాలీవుడ్ మూవీలా ‘సర్దార్’

- Advertisement -
- Advertisement -

Hero Karthi interview about 'Sardar' Movie

హీరో కార్తి, ‘అభిమన్యుడు’ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ’సర్దార్’. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా శుక్రవారం ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో హీరో కార్తితో ఇంటర్వూ…
మొదటిసారి తండ్రి, కొడుకు పాత్రల్లో…
ఇండియన్ స్పై థ్రిల్లర్‌గా ‘సర్దార్’ వస్తోంది. ఇందులో మొదటిసారి తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపిస్తున్నా. కథ ప్రకారం చాలా గెటప్స్ వుంటాయి. ఒక గ్రామంలో పెరిగిన రంగస్థల నటుడు గూఢచారిగా మారి ఏం చేశాడనేది దర్శకుడు మిత్రన్ అద్భుతంగా చూపించారు. 1980లో జరిగే కథ, ఆ ప్రపంచాన్ని చాలా వండర్‌ఫుల్‌గా తీశారు. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు.
హాలీవుడ్ మూవీలా చూపించాం…
ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. ‘సర్దార్’ని అలా ఒక హాలీవుడ్ మూవీలా చూపించాం. నా కెరీర్‌లో ఇది సవాల్‌తో కూడిన పాత్ర. కెమెరామెన్ జార్జ్ కొత్త ప్రపంచం చూపించారు. 1980 వరల్డ్‌ని సృస్టించారు. జీవీ ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు.
కుటుంబం అంతా కలసి ఎంజాయ్…
సర్దార్ పాత్రను రియల్ క్యారెక్టర్ స్ఫూర్తితో డిజైన్ చేశారు. ఇక్కడ పుట్టిన ఒక రంగస్థల నటుడు పాకిస్థాన్‌లో జనరల్‌గా పని చేశారు. దీన్ని స్ఫూర్తిగా సర్దార్ కథని రాశారు. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. దీపావళికి కుటుంబం అంతా కలసి ‘సర్దార్’ని ఎంజాయ్ చేయొచ్చు.
పాన్ ఇండియా సినిమానే…
యూనివర్సల్ అప్పీల్ వున్న సినిమా సర్దార్. ఈ సినిమాలో విలన్‌గా చేసిన చుంకీ పాండే మొదటి రోజు నుండి ఇది పాన్ ఇండియా సినిమా అనే చెబుతున్నారు. ఇప్పుడు హిందీలో కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా వున్నాయి. ఒక వారం తర్వాత బాలీవుడ్‌లో విడుదల చేయాలనే ఆలోచన వుంది.
అన్నయ్య సర్‌ప్రైజ్ అయ్యారు…
మిత్రన్‌ది మంచి వ్యక్తిత్వం. దర్శకుడిగా ఒక బలమైన విషయాన్ని సమాజానికి చెప్పాలి, చూపించాలనే ఆయన తపన నాకు నచ్చింది. ‘సర్దార్’ ట్రైలర్ అన్నయ్య చూసి చాలా సర్‌ప్రైజ్ అయ్యారు. చాలా పెద్ద సినిమా, బలమైన కంటెంట్ వున్న సినిమాలా అనిపిస్తుందని చెప్పారు.

Hero Karthi interview about ‘Sardar’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News