Monday, January 20, 2025

నా ఇమేజ్ కు సరైన మూవీ…

- Advertisement -
- Advertisement -

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘భజే వాయు వేగం‘. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ‘భజే వాయు వేగం‘ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ గుమ్మకొండ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

నా ఇమేజ్ కు సరైన మూవీ…
‘భజే వాయు వేగం‘ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత కథ మీద, దర్శకుడు ప్రశాంత్ మీద మరింత నమ్మకం పెరిగింది. ఈ సినిమా ఇప్పుడున్న నా ఇమేజ్ కు సరైన మూవీ. హీరో అంటే మనం పోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఎంచుకునే మార్గాలు..ఇవన్నీ స్ఫూర్తినిచ్చేలా ఉండాలని భావిస్తా. అప్పుడే ప్రేక్షకులు అతన్ని హీరోలా చూస్తారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ‘భజే వాయు వేగం‘లో ఉంటుంది.

‘ఖైదీ’ టైపులో ఊహించుకున్నా…
సినిమాలో హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. ఈ కథ దర్శకుడు ప్రశాంత్ చెప్పినప్పుడు కార్తి హీరోగా నటించిన ఖైదీ టైపులో ఊహించుకున్నాను. ఖైదీలో ఉన్నంత యాక్షన్ ఈ మూవీలో ఉండదు కానీ అలాంటి ఎమోషనల్ డ్రైవ్, హీరోకు ఒక సమస్య, అతనికుండే ధైర్యం… ఇలాంటి ఫ్రేమ్‌లో కథ ఉంటుంది. సెకండాఫ్‌లో రేసీ స్క్రీన్ ప్లేతో మూవీ సాగుతుంది.

ఆమెది ముఖ్యమైన పాత్ర…
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన ట్విస్టులేవీ ‘భజే వాయు వేగం‘ సినిమాలో ఉండవు. ఆమెది ముఖ్యమైన పాత్ర. కథను ముందుకు తీసుకెళ్తుంటుంది. ట్రైలర్‌లో ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన షాట్స్ తక్కువగా ఉన్నాయంటే కారణం ఆమెకు సంబంధించిన షాట్స్ పెడితే కథ తెలిసిపోతుంది. ‘భజే వాయు వేగం‘ ఫస్టాఫ్‌లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు. సెకండాఫ్ లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనేది చూపిస్తున్నాం.

ఆ తర్వాతే స్టైలిష్ మేకోవర్‌లో చేస్తున్నా…
హీరోగా చేస్తున్న టైమ్‌లో విలన్‌గా గ్యాంగ్ లీడర్, వాలిమై చిత్రాల్లో నటించడం సరికాదని భావించడం లేదు. అప్పటిదాకా నా సినిమాల రేంజ్ వేరు, గ్యాంగ్ లీడర్ సినిమా రేంజ్ వేరు. అజిత్ తో వలిమై సినిమాలో నటించాక..తమిళనాట గుర్తింపు దక్కింది. ఈ సినిమాల తర్వాతే నేను స్టైలిష్ మేకోవర్ లో సినిమాలు చేయడం ప్రారంభించా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News