Monday, January 20, 2025

స్టయిలిష్ ఎక్స్ పల్స్ 200టి 4-వాల్వ్ ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే మోటార్‌సైకిళ్లు,స్కూటర్‌ల అతిపెద్ద తయారీసంస్థ అయిన హీరో మోటోకార్ప్ తన ప్రీమియం పోర్ట్‌ ఫోలియోకు నవ్యతను, థ్రిల్లింగ్ అనుభూతులను జోడించడంలో తన నిబద్ధతను మరింత పటిష్ఠం చేస్తూ నేడి క్కడ ఆల్-న్యూ ఎక్స్‌ పల్స్ 200T 4వాల్వ్‌ ను ఆవిష్కరించింది. మెరుగైన టూరింగ్ సామర్థ్యాలు, అత్యుత్తమ అత్యాధునిక సాంకేతికత, డిజైన్ లతో, పనితీరులో స్పష్టమైన పు రోగతితో, సరికొత్త హీరో ఎక్స్ పల్స్ 200టి 4-వి, ఎక్స్ పల్స్ విజయగాథలో మరో అధ్యాయాన్ని రాయడానికి సిద్ధంగా ఉంది.

200cc 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో అమర్చబడి, ఆధునిక టూరర్ 6% ఎక్కువ శక్తిని, 5% అదనపు టార్క్‌ ను అందిస్తుంది, తద్వారా రోజంతా అధిక వేగంతో ఆహ్లాదకరమైన, ఒత్తిడి లేని రైడ్‌ను అందిస్తుంది. రీ-ట్యూన్ చేయబడిన పవర్-టార్క్ కర్వ్, రివైజ్డ్ ట్రాన్స్‌ మిషన్ రేషియోలు ఇందుకు వీలు కల్పిస్తోంది. తద్వారా వినియోగదారులు ప్రతి ప్రయాణాన్ని కూడా ఎంతగానో ఆస్వాదించవచ్చు. ఈ మోటార్‌సైకిల్‌లో అత్యుత్తమ టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీ టర్, సర్వీస్ రిమైండర్ వంటి అనేక రకాల ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు ఉన్నాయి.

ఎక్స్‌ పల్స్ 200T 4వాల్వ్‌ దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌ల వద్ద ఆకర్షణీయమైన ధర రూ. 1,25,726* వద్ద అందుబాటులో ఉంది. (*ఎక్స్-షోరూమ్, ముంబై)

ఈ సందర్భంగా హీరో మోటో కార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ (సీజీఓ) రంజీవ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ, “భారతదేశం లోని మోటార్‌సైక్లింగ్ ఔత్సాహికులలో ఎక్స్ పల్స్ ఒక దృఢమైన స్థానాన్ని సంపాదించుకుంది. కొత్త హీరో ఎక్స్ పల్స్ 200టి 4వి విడుదలతో ఈ ట్రెండ్ మరింత బలపడుతుందని మేం విశ్వసిస్తున్నాం. రైడర్లకు విలక్షణమైన అనుభవాన్ని అందించే హీరో ఎక్స్ పల్స్ 200టి 4వి నిజంగా సరికొత్త అవతారంలో, బోల్డ్, యూత్‌ఫుల్, రెట్రో డి జైన్ అంశాలతో వస్తుంది. హైవేలపై దూరప్రయాణాలు, స్వేచ్ఛ కల కలయికగా కొత్త మోటార్‌సైకిల్ అత్యంత సౌలభ్యం, పనితీరుతో సాటిలేని టూరింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది.

హీరో ఎక్స్ పల్స్ 200టి 4వి, ఎక్స్ పల్స్ 200 రైడర్‌ల కమ్యూనిటీ రైడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన XCLANని ఎప్ప టికప్పుడు విస్తరిస్తున్నది. XCLAN సభ్యత్వం కస్టమర్‌లు తమ యాజమాన్య అనుభవాన్ని ఎక్కువగా పొంద డంలో సహాయపడటానికి ప్రత్యేకమైన ప్రయోజనాల ప్రపంచానికి యాక్సెస్‌ను అందిస్తుంది.

ఉత్పాదన ముఖ్యాంశాలు

ఇంజిన్ పనితీరు

BS-VI 200cc 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో శక్తివంతమైన ఎక్స్ పల్స్ 200టి 4వి గరిష్టంగా 19.1 PS @ 8500 RPM వద్ద శక్తిని, 17.3 Nm @ 6500rpm టార్క్‌ ను విడుదల చేస్తుంది. రిచ్ టార్క్ ఆహ్లాదకరమైన ప ర్యటన అనుభూతిని అందిస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడిన ఇంజన్ డైనమిక్ ప్రొపల్షన్, సౌకర్య వంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

మిడ్-రేంజ్, టాప్-ఎండ్ స్పీడ్‌ల వద్ద అధిక శక్తితో పాటు, 4 వాల్వ్ ఆయిల్-కూల్డ్ ఇంజన్ అధిక వేగంతో కూడా ఒత్తిడి-రహిత పనితీరును అందిస్తుంది. ఎక్స్ పల్స్ 200టి 4వి యొక్క గణనీయంగా మెరుగుపరచబడిన ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ మరింత శక్తి, మన్నికను అందిస్తుంది. మెరుగైన ట్రాక్టివ్ ఎఫర్ట్, యాక్సిలరేషన్ కోసం గేర్ నిష్పత్తి అప్‌గ్రేడ్ చేయబడింది.

స్టైల్ & డిజైన్

కొత్త ఎక్స్ పల్స్ 200టి 4వి అప్‌డేట్ చేయబడిన డిజైన్ రెండు చక్రాలపై ఆహ్లాదకర అనుభూతిని అందించేలా రూపొందించబడింది. నియో-రెట్రో స్టైలింగ్, బోల్డర్ గ్రాఫిక్స్‌ తో కూడిన ప్రత్యేక రంగు స్కీమ్‌లు చక్కదనం, ప్ర త్యేక క్లాసిక్ విశిష్టతను అందిస్తాయి. క్రోమ్ రింగ్‌తో కూడిన వృత్తాకార ఫుల్–ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 20 mm తగ్గించిన LED పొజిషన్ ల్యాంప్‌లు వంటి విలక్షణమైన ఫీచర్లు వాహనం ప్రపోర్షన్స్ ను మెరుగు పరుస్తాయి.

రైడర్, వెనుక కూర్చున్న వారికి అందుబాటులో ఉన్న ప్రీమియం ఫినిష్డ్ రిలాక్స్డ్ సీటింగ్ పొజిషన్, ట్యూబ్-టైప్ రెట్రో పిలియన్ గ్రాబ్ సాటిలేని సౌకర్యవంతమైన రైడ్ అనుభూతికి దోహదం చేస్తాయి. దీని విభిన్నమైన కలర్డ్ విజర్, ఫ్రంట్ ఫోర్క్ స్లీవ్‌లు, కలర్డ్ సిలిండర్ హెడ్‌తో మరింత స్టైల్ ను అందిస్తాయి.

సాంకేతికతతో శక్తివంతం

ఎక్స్ పల్స్ 200టి 4వి మీ ప్రయాణాన్ని మరింత సురక్షితం, మరింత సౌకర్యవంతంగా చేసే వివిధ రకాల తెలి వైన సాంకేతికతలను అందిస్తుంది. స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్‌ లతో కూడిన పూర్తి డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, అండర్ సీట్ USB ఛార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్-స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ లాంటివాటితో మోటార్‌సైకిల్ సాంకేతికంగా అధునాతనంగా, సురక్షితంగా ఉంటుంది.

సంపూర్ణ టూరర్

37mm ఫ్రంట్ ఫోర్క్స్ & 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనో-షాక్ సస్పెన్షన్, సుపీరియర్ గ్రిప్, ట్రాక్షన్‌తో 130mm వెడ ల్పు గల రేడియల్ రియర్ టైర్ కచ్చితమైన హ్యాండ్లింగ్‌ను అందిస్తాయి, ప్రతి కిలోమీటరు ప్రయాణాన్ని మరిం త ఆహ్లాదభరితం చేస్తాయి.

USB ఛార్జర్ రైడర్ నడుపుతున్నప్పుడు కనెక్ట్ అవ్వడాన్ని సులభతరం చేస్తుంది. 276mm ఫ్రంట్, 220mm వెనుక పెటల్ డిస్క్ బ్రేక్‌లు రైడర్ ఎల్లప్పుడూ పూర్తి నియంత్రణలో, ఆపే శక్తిపై నమ్మకంగా ఉండేలా చూస్తా యి.

ఉత్తేజకరమైన రంగు ఎంపికలు

కొత్త ఎక్స్ పల్స్ 200టి 4వి మూడు ఉత్తేజకరమైన కొత్త కలర్ ఆప్షన్‌లలో – స్పోర్ట్స్ రెడ్, మాట్ ఫంక్ లైమ్ ఎల్లో, మాట్ షీల్డ్ గోల్డ్ – వస్తుంది. వీటిలో ప్రతి ఒక్కటి మోటార్‌సైకిల్ విభిన్న విలక్షణతలను నైపుణ్యంగా ప్రదర్శిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News