Sunday, December 22, 2024

‘ఎక్స్‌ ట్రీమ్’ పోర్ట్‌ ఫోలియోను ప్రవేశపెట్టిన హీరో మోటోకార్ప్..

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల అతిపెద్ద తయారీసంస్థ అయిన హీరో మోటోకార్ప్ ప్రీమియం విభాగంపై దృష్టి సారించి నేడు తన ప్రీమియం పోర్ట్‌ ఫోలియోను మరో శక్తివంతమైన జోడింపుతో పెంచుకుంది. హీరో ఎక్స్ ట్రీమ్ 160R 4V ఆవిష్కరణ తరువాత కంపెనీ కొత్తగా ఎక్స్ ట్రీమ్ 200S 4 వాల్వ్‌ ను ప్రవేశపెట్టింది. కొత్త ఎక్స్ ట్రీమ్ 200S 4V అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ అయిన ఎక్స్ ట్రీమ్ విజయవంతమైన ప్రయాణం లో థ్రిల్లింగ్ కొత్త అధ్యాయాన్ని జోడిస్తుంది. దీనితో, కంపెనీ తన పునర్నిర్వచించబడిన X-శ్రేణి ప్రీమియం మోటా ర్‌సైకిళ్లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో తన ఆకర్షణను పెంచుకోవడానికి శక్తివంతం చేయబడింది.

కొత్త హీరో ఎక్స్ ట్రీమ్ 200S 4V పవర్-ప్యాక్డ్ రైడింగ్ డైనమిక్స్, అత్యున్నత భద్రత, రోజువారీ పనితీరుతో కూడి న స్పోర్టీ క్యారెక్టర్‌ను అందిస్తుంది. కచ్చితమైన అంచులతో పాటు థ్రిల్లింగ్ డిజైన్ మోటార్‌సైకిల్ అథ్లెటిక్ స్వభావా న్ని ప్రేరేపిస్తుంది. అత్యాధునిక ఎల్ఈడీ హెడ్‌లైట్స్ అన్ని రహదారులలో అత్యుత్తమ దృశ్యమానతకు వీలు కల్పిస్తాయి. అద్భుతమైన కొత్త డ్యూయల్-టోన్, స్పోర్టీ గ్రాఫిక్స్ మోటార్‌సైకిల్ విశిష్ట లక్షణాన్ని ప్రదర్శి స్తాయి. మోటార్‌సైకిల్ ఎర్గోనామిక్స్‌ ను మెరుగుపరచడమే కాకుండా, కొత్త స్ప్లిట్ హ్యాండిల్‌బార్ ఈ సుదూర ప్రయాణాల బైక్ అథ్లెటిక్ శక్తిని ప్రేరేపిస్తుంది. రోజంతా ప్రతి వంపులో, సూటి మార్గంలో మీరు పోటీ పడటానికి మీకు వీలు కల్పిస్తుంది. తెలివైన కొలతలతో ఆప్టిమైజ్ చేయబడిన ఏరోడైనమిక్ డిజైన్ చురుకైన, కచ్చితమైన నిర్వహణను అందించడానికి కలిసి పని చేస్తాయి. 200cc4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ 6% ఎక్కువ శక్తిని, 5% అదనపు టార్క్‌ ని అందజేస్తుంది, రాజీపడని స్పోర్టీ పనితీరును అందిస్తుంది.

కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌ ల కోసం బ్లూటూత్‌తో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ అందిం చబడింది. రియర్ హగ్గర్ కొత్త ఎక్స్ ట్రీమ్ 200S 4Vని స్పోర్టీ రైడింగ్‌తో పాటు నగరంలో సుదీర్ఘ ప్రయాణం చేయడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. హీర్ ఎక్స్ ట్రీమ్ 200S 4V దేశవ్యాప్తంగా హీరో మోటోకార్ప్ డీలర్ షిప్ లలో రూ. 1,41,250లకు లభిస్తుంది.

ఎక్స్ షో-రూమ్ దిల్లీ

హీరో మోటార్ కార్ప్, ఇండియా బీయూ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “హీరో ఎక్స్‌ ట్రీమ్ 200S మా ప్రీమియం స్పోర్ట్స్ సెగ్మెంట్ కోసం మా ఫోకస్డ్ విధానాన్ని ప్రదర్శిస్తుంది. రైడింగ్ ఔ త్సాహికులకు నిజమైన మాస్టర్ పీస్ ఇది. హీరో ఎక్స్‌ ట్రీమ్ 200S 4V అనేది ఆల్ డే స్పోర్ట్స్ మోటార్‌సైకిల్. అర్బన్, స్పోర్టీ పనితీరును చక్కగా మిళితం చేస్తుంది. మేం మా ప్రీమియం ఉత్పత్తుల కోసం అడ్వెంచర్, టూ రింగ్, స్ట్రీట్‌ఫైటర్ విభాగాల్లో సమాంతర వ్యూహాన్ని విజయవంతంగా రూపొందించాం, అభివృద్ధి చేశాం, అధిక కస్టమర్ స్పందనను పొందాం. మా తాజా ఉత్పాదన- ఎక్స్ ట్రీమ్ 200S 4V, ఈ విభాగం విజయాన్ని మరింత పెంపొందిస్తుందని, మా కస్టమర్‌లతో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తుందని మేం నమ్ముతున్నాం’’ అని అన్నా రు.

ఉత్పాదన ముఖ్యాంశాలు:

విభాగంలో అత్యుత్తమం – 4 వాల్వ్ టెక్నాలజీ

కొత్త హీరో ఎక్స్ ట్రీమ్ 200S 4V, XSense టెక్నాలజీతో కూడిన 200cc 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ OBD2, E20 అనుగుణ్య ఇంజన్‌ ఆధారితమైనది. 19.1 PS @ 8000 RPM అవుట్‌పుట్, 17.35 Nm@ 6500 RPM గరిష్ట టార్క్‌ తో, ఇంజన్ స్పోర్టీ రైడింగ్ డైనమిక్స్, ఆనందాన్ని పెంచుతుంది. 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ మిడ్, టాప్-ఎండ్ స్పీడ్ రేంజ్‌లో అత్యుత్తమ శక్తిని అందించడమే కాకుండా, వైబ్రేషన్‌లను కంట్రోల్‌లో ఉంచుతూ హై-స్పీడ్‌లో కూడా ఒత్తిడి లేని ఇంజిన్ పనితీరును అందిస్తుంది. ఎక్స్ ట్రీమ్ 200S 4Vలో గణనీయంగా మెరుగుపరచబడిన ట్రాన్స్‌ మిషన్ మెరుగైన బలం, మన్నికను అందిస్తుంది, గేర్ నిష్పత్తి మెరుగైన ట్రాక్టివ్ ఎఫర్ట్, యాక్సిలరేషన్ కోసం అప్‌డేట్ చేయబడింది.

ఎంతో స్టైలిష్

స్వచ్ఛమైన పనితీరు, సాటిలేని స్పోర్టీ పాత్ర అద్భుతమైన కలయికను ఈ ప్రగతిశీల డిజైన్ ప్రతిబింబిస్తుంది. నవీకరించబడిన రైడర్ ఎర్గోనామిక్స్‌ తో పాటు నూతన స్ప్లిట్ హ్యాండిల్‌బార్ సెటప్ మెరుగైన చురుకుదనాన్ని, వంపుల వద్ద పదునైన హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది. స్పోర్టీ ఏరోడైనమిక్స్, ఫెయిరింగ్, కచ్చితమైన అంచులు మోటార్‌ సైకిల్ దూకుడు వైఖరిని నిర్వచించాయి, పటిష్ఠమైన రియర్ కౌల్, స్పోర్టీ కాంపాక్ట్ దీని అథ్లెటిక్ స్వభావాన్ని నొక్కి చెబుతాయి. తక్కువ వీల్‌బేస్, తగ్గిన ట్రయల్, అత్యంత ఆకర్షణీయతను, స్పోర్టీ రైడ్ అనుభవాన్ని జోడిస్తుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్ లతో కూడిన ట్విన్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ రహదారిని ప్రకాశవంతం చేయడంతో పాటు, తలలు తిప్పి దీని ఉనికిని, సంపూర్ణ శక్తిని గుర్తించేలా చేస్తాయి. ఈ సిగ్నేచర్ ఎల్ఈడీ టెయిల్-లైట్లు, ఎల్ఈడీ లైట్‌గైడ్‌లు బైక్ ఎప్పుడూ ట్రాఫిక్‌లో సులభంగా గుర్తించబడేలా చేస్తాయి.

రాజీపడని పనితీరు, భద్రత

7-దశల అడ్జస్టబుల్ మోనో-షాక్ సస్పెన్షన్, సుపీరియర్ గ్రిప్, ట్రాక్షన్‌తో కూడిన 130 మిమీ వెడల్పు గల రేడియల్ వెనుక టైర్ కచ్చితమైన హ్యాండ్లింగ్‌ని అందిస్తుంది, ప్రతి కిలోమీటరును మరింత రిలాక్స్‌ గా చేస్తుంది. సింగిల్ ఛానల్ ఏబీఎస్ తో పాటు అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్, రియర్ పెటల్ డిస్క్ బ్రేక్‌లు అధిక స్థాయి సమర్థవంతమైన బ్రేకింగ్, భద్రతను అందిస్తాయి.

కనెక్టివిటీ

హీరో ఎక్స్‌ ట్రీమ్ 200S 4Vలో పూర్తి-డిజిటల్ ఎల్సీడీ మీటర్ రీడబిలిటీ పరంగా మాత్రమే కాకుండా, ఆపరేటింగ్ కాన్సెప్ట్‌ గా మీ కోసం కొత్త ప్రపంచాన్ని తెరుస్తుంది. ఇది గేర్ ఇండికేటర్, ఎకో-మోడ్ ఇండికేటర్, సర్వీస్ రిమైండ ర్, ట్రిప్ మీటర్ వంటి అసమానమైన ఫీచర్‌లను అందిస్తుంది. ఇది వాహన సామర్థ్యంపై రెగ్యులర్ అప్‌ డేట్‌లను అందిస్తుంది. అదనంగా, ఇది స్మార్ట్-ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను కూడా అందిస్తుంది.

వ్యక్తీకరణ రంగులు

మూన్ ఎల్లో, పాంథర్ బ్లాక్ మెటాలిక్, ప్రీమియం స్టెల్త్ ఎడిషన్ వంటి అద్భుతమైన, శక్తివంతమైన డ్యూయల్-టోన్ కలయికలు కొత్త ఎక్స్ ట్రీమ్ 200S 4V సాటిలేని డైనమిక్ స్పోర్ట్స్ క్యారెక్టర్‌ను సంపూర్ణంగా వ్యక్తీకరిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News