Wednesday, January 22, 2025

ఊర్లో మనం తోపు అని అందరికీ తెలుసు: హీరో నాగశౌర్య  

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌, థియేట్రికల్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. జూలై 7న విడుదల కానున్న నేపథ్యంలో హీరో నాగశౌర్య విలేకరుల సమావేశంలో ‘రంగబలి’ విశేషాలని పంచుకున్నారు.

‘రంగబలి’పై చాలా కాన్ఫిడెంట్  గా  కనిపిస్తున్నారు ?
ఒక మంచి జరుగుతున్నప్పుడు ఆ రోజు మొదలుపెట్టడమే చాలా ఎనర్జీతో పాజిటివ్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకంతోనే ఇంత కాన్ఫిడెంట్ గా వున్నాను. ప్రేక్షకులకు సినిమా గురించి ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. రంగబలి చాలా మంచి సినిమా.

కొత్త దర్శకుడు పవన్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
దర్శకుడు, నటుడికి స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ పవన్ ఇచ్చాడు. ఇది చాలా మంచి సినిమా. ఏ విషయంలో కూడా ఒత్తిడి తీసుకొవద్దని, ఏ సాయం కావాలన్నా చేస్తానని పవన్ కి ముందే చెప్పాను. తను  చెప్పింది చెప్పినట్లుగాన తీశాడు. నాకు నా సినిమాల విషయంలో అనుభవం వుంది. ఎక్కడ కరెక్ట్ గా జరుగుతుందో చెప్పలేను కానీ ఎక్కడ తప్పు జరుగుతుందో అర్ధమైపోతుంది.ఆ అనుభవాన్ని, పవన్ విజన్ ని జోడించి అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగాం.

షూటింగ్ ప్రాసెస్ లో హెల్త్ ఇష్యూ వలన సెట్స్ లోకి అంబులెన్స్ వచ్చిందని విన్నాం.. రిస్క్ అనిపించలేదా ?
నేను వచ్చిందే ప్రేక్షకులని మెప్పించడానికి. ఇప్పుడున్న పోటీకి ప్రతి ఒక్కరూ ఎక్స్ టార్డినరిగా యాక్ట్, డ్యాన్స్, యాక్షన్.. అన్నీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మనమూ ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకొక్కసారి గాయాలు అవుతాయి. మనం ఎంచుకున్న వృత్తిలో ఇవన్నీ భాగమే. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది.

మీ నిర్మాణంలో చేసిన సినిమాల ఫలితాలు పట్ల తృప్తిగా వున్నారా?
ఏ ప్రొడక్షన్ హౌస్ లో నైనా పది సినిమాలు హిట్లు పడిన తర్వాత కూడా ఒక సినిమా నిరాశ పరిస్తే దాన్ని రికవర్ చేయడం అంత తేలిక కాదు. సినిమా అంటే పిచ్చి ప్యాషన్ తో సినిమాలు నిర్మిస్తున్నాం తప్పితే డబ్బులు సంపాయించుకోవాలని కాదు. మాకు సినిమా అంటే పిచ్చి ఇష్టం. మాకు ఇది తప్పితే వేరేది తెలీదు.

 హీరోయిన్ యుక్తి తరేజ గురించి ?
యుక్తి చాలా మంచి యాక్టర్ అండ్ డ్యాన్సర్. ఇందులో చాలా చక్కగా నటించింది. తను టాలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్  అయ్యే అవకాశాలు వున్నాయి.

రంగబలి ఎలాంటి సినిమా ?
మన ఊర్లో మనం తోపు అని అందరికీ తెలుసు. సొంత ఊరు అనే ఫీలింగే వేరు. ఈ సినిమా చూస్తున్నపుడు మళ్ళీ మన రూట్స్ ని టచ్ చేసి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది.

రంగబలి కథ రంగా గారి జీవితానికి స్ఫూర్తిగా ఉంటుందా ?
లేదండీ. రంగా గారికి దీనికి సంబంధం లేదు. సినిమా చూసిన తర్వాత రంగబలి అంటే ఏమిటనేది తెలుస్తుంది. ఈ కథకి ఆ టైటిల్ యాప్ట్.

నటనతో పాటు రచన, నిర్మాణం ప్రయత్నించారు. దర్శకత్వం చేయాలని ఉందా ?
లేదండీ. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు.

 కథల జడ్జిమెంట్ విషయంలో ఎలాంటి కసరత్తు చేస్తారు ?
ఎవరి కథని జడ్జ్ చేయలేమని నా అభిప్రాయం. నిజానికి మనం జడ్జ్ చేయాల్సింది డైరెక్టర్ ని. తను ఎలా తీయగలడు అనేది చూడాలి. ఒక సీక్వెన్స్ ని ఎలా తీస్తావని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం బట్టి కొంత జడ్జిమెంట్ లోకి రావచ్చు.

రంగబలి మ్యూజిక్ గురించి
పవన్ సి హెచ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు, ఆర్ఆర్ రెండూ అద్భుతంగా ఉంటాయి. థియేటర్ లో చాలా ఎంజాయ్ చేస్తారు.

కొత్త సినిమాలు గురించి ?
24వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత రెండో షెడ్యుల్ మొదలుపెడతాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News