Wednesday, April 23, 2025

సినిమా డిజాస్టర్‌ అని అలా ఎలా డిసైడ్ చేస్తారు: నాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినిమాలపై రివ్యూల ప్రభావం చాలా ఉంటుంది. సోషల్‌మీడియా వాడకం పెరిగిపోయాక.. రివ్యూలు ఇచ్చేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. చాలా మంది ఈ రివ్యూలు చూసే సినిమాకు వెళ్లాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో చాలా సినిమాలకు ఆడియన్స్ తగ్గిపోతున్నారు. తాజాగా ఈ అంశంపై హీరో నాని స్పందించారు.

నాని ప్రస్తుతం హిట్-3 సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించనంత వైలెంట్ పాత్రలో నాని కనిపిస్తున్నారు. కెజిఎఫ్ సినిమాతో అందరిని అలరించిన శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మే 1వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాని.. రివ్యూలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘రివ్యూలను చెప్పే వారిని ఆపడం కుదరదు వాళ్లని ఎందుకు ఆపాలి? ఎలా ఆపాలి?. సినిమా నచ్చకపోతే.. నచ్చలేదు అని చెప్పాలి. కానీ, సినిమా ఆడదు అని చెప్పొద్దు. సినిమా వచ్చిన మొదటి రోజే డిజాస్టర్ అని ఎలా చెబుతారు. కనీసం ఒక పది రోజులైనా ఎవరూ చూడకపోతే.. అప్పుడు అది డిజాస్టర్ అవుతుంది. అంతేకానీ.. మొదటి రోజు, మార్నింగ్ షోకే ఎలా డిసైడ్ చేస్తారు. వ్యక్తిగతంగా సినిమాపై అభిప్రాయం ఎలా ఉన్నా ఓకే.. కానీ, ప్రొఫెషనల్స్ అలా చేయడం కరెక్ట్ కాదు’ అని నాని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News