Tuesday, April 29, 2025

సల్మాన్ వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చిన నాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సౌత్ ఇండియాలో ప్రేక్షకుల తమపై బయట ప్రేమని చూపిస్తారని.. కానీ, అదే ప్రేమ థియేటర్లకు రావడంలో చూపించరు అంటూ సల్మాన్ ఖాన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హీరో నాని రియాక్ట్ అయ్యారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ తరతరాల నుంచి హిందీ సినిమాలను ఆదరిస్తుందని నాని అన్నారు.

‘‘దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. కానీ, ఎప్పటి నుంచో మనం హిందీ సినిమాలను ఆదరిస్తున్నాం. దశాబ్ధాలుగా హిందీ సినిమాలను చూస్తున్నాం. అమితాబ్ నటించిన ఎన్నో సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఎన్నో మంచి సినిమాలు ఇక్కడ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇక సల్మాన్ ఖాన్‌కు ఇక్కడ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల్లో ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం’’ అని నాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News