Wednesday, January 22, 2025

డిజిపి,సిపి తో హీరో నిఖిల్ సిద్దార్థ బ్రేక్ ఫాస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం నిర్వహించారు. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో పోలీసు వాహనాల ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై జరిగిన కార్యక్రమంలో ద్విచక్ర వాహనాలు, డయల్ 100 పెట్రోలింగ్ వాహనాలతో ర్యాలీని హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిజిపి అంజనీ కుమార్ , హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్ సిద్దార్థ అతిథిగా హాజరయ్యారు. స్టేజ్ పై మాట్లాడిన ఆయన డిజిపి, సిపితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. రియల్ హీరోలైన తెలంగాణ పోలీసుల కార్యక్రమానికి హాజరైనందుకు, డిజిపి, సిపితో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఆలోచనలు పంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి సిపి సివి ఆనంద్ స్పందించారు. ‘నిఖిల్ ఫంక్షన్‌కి రావడం చాలా బాగుంది. ఆయన హైదరాబాద్, తెలంగాణ పోలీసులకు స్నేహితుడు. నేను 12 సంవత్సరాల క్రితం ట్రాఫిక్ అడిషనల్ సిపిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఆయన బ్రాండ్ ఐకాన్‌గా ఉన్నారు’ అని గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News