Wednesday, January 22, 2025

నన్ను డ్రగ్స్ తీసుకోమని అడిగారు: హీరో నిఖిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో పాల్గొన్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ.. ”చాలా మంది నన్ను డ్రగ్స్ తీసుకోమని అడిగారు. ఎంత ఒత్తిడి చేసినా నేను లొంగలేదు.కొందరి వల్ల సినీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. డ్రగ్స్‌కు అలవాటు పడితే.. అదే మరణం. విద్యార్థులకు ముందు ఎంతో మంచి భవిష్యత్ ఉంది.డ్రగ్స్ తీసుకుని జీవతాలు నాశనం చేసుకోవద్దు” అని పేర్కొన్నారు.
అనంతరం సిపి ఆనంద్ మాట్లాడుతూ.. ”డ్రగ్స్ అనేది సమాజంలో ప్రస్తుతం పెద్ద సమస్యగా మరింది. అఫ్గాస్థాన్, పాకిస్థాన్ దేశాల నుంచి డ్రగ్స్ ఇండియాకు వస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి” అని చెప్పారు.
మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించిన ఈ కార్యక్రమంలో సిపి ఆనంద్, హీరో నిఖిల్ తోపాటు నటుడు ప్రియదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: నిఖిల్ నిజమైన రాక్‌స్టార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News