నల్లగొండ: చందంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలోఏర్పాటు చేసిన మంత్రివర్యులు బర్తడే కార్యక్రమానికి దేవరకొండ శాసనసభ్యులు కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమ వీరుడు.. నల్లగొండ అభివృద్ధి సూర్యుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు.. గుంటకండ్ల జగదీష్ రెడ్డి అని దేవరకొండ శాసన సభ్యులు ,బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు.నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత నిరంతరం ప్రజా సేవకై కృషి చేస్తు నేనున్నా అని అభయం ఇచ్చే మహోన్నత వ్యక్తి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అని ఆయన అన్నారు. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలి అని ఆ యన ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయువు ఆరోగ్యాలతో విరాజిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది.ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేవలం మంత్రి కృషితోనే రెండు మెడికల్ కాలేజీలు మంజూరు కావడం జరిగింది అని అన్నారు.
ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకొని తిరిగే నేతలకు ఓటమి దెబ్బ చవిచూపిన నేత మన ప్రియతమ మంత్రి అని అన్నారు.ఆనాటి ఉద్యమ సమయం నుంచి నేటి వరకు బిఆర్‌ఎస్ పార్టీకి రథ సారధిగా వహిస్తూ జిల్లా రూపురేఖలను మార్చిన మహోన్నత వ్యక్తి జగదీశ్వర్‌రెడ్డి అని ఆయన అన్నారు.కేవలం జగదీశ్వర్ రెడ్డి కృషి పట్టుదలతోనే నేడు ప్రతిపక్ష పార్టీల కోటలు బీటలు పట్టాయి అని ఆయన తెలిపారు.ఇచ్చిన ఈ స్పూర్తితోనే జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ జెండా రెపరేపలాడింది అని వివరించారు. ఈకార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు దొందేటి మల్లా రెడ్డి,రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,గోసుల అనంతగిరి, కేతవత్ శంకర్ అర్జున్ పాపా నాయక్ రోజా రవి నాయక్ మద్దిమడుగు అర్జున్ దేవా నాయ క్. కొండల్ రెడ్డి, బి ఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ..