Tuesday, January 21, 2025

ఆ హీరో శారీరకంగా, మానసికంగా వేధించాడు: ఐశ్వర్యరాయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ గురించి ఏదో ఒక వార్త సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఓ నటిమణి కారణంగా ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని చర్చ జరిగింది. దస్వి సినిమాలో అభిషేక్ బచ్చన్‌తో నిమ్రత్ కౌర్ నటించారు. ఆమె కారణంగా దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకున్నాయి. ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలాంటిదేమీ లేదని దంపతులు స్పందించిన విషయం తెలిసిందే.

తాజాగా ఐశ్వర్యరాయ్ ఇంటర్వూలో మాట్లాడుతుండగా సల్మాన్‌ఖాన్‌తో రిలేషన్ గురించి యాంకర్ ప్రశ్నించారు. సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, మద్యం తాగి తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఐశ్వర్య రాయ్ తెలిపింది. సల్మాన్‌తో ప్రేమలో ఉన్నప్పుడు బ్యాడ్ డేస్ ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. తనని సల్మాన్ శారీరకంగా, మానసికంగా వేధించాడని వివరించింది. దీంతో ఖాన్‌తో విడిపోవాల్సి వచ్చిందని గుర్తు చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో చివరిసారిగా ఐశ్వర్య రాయ్ నటించారు. ఈ సినిమాలో నందిని పాత్రకు ఆమె సిమా, ఇఫా అవార్డులను అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News