Friday, January 10, 2025

రికార్డుల రారాజు ప్రభాస్.. బర్త్ డే విషెస్ వెల్లువ

- Advertisement -
- Advertisement -

ప్రభాస్… ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై పాన్ వరల్డ్ అంతటా మార్మోగుతోంది. టాలీవుడ్‌లో హీరోలు పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్‌కే పేరు తెచ్చిన స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు ఆయన సృష్టిస్తున్న నెంబర్స్, రికార్డ్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి. సలార్ సినిమాలో ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్‌కు కొన్ని కొన్ని నమ్మేయాలనుకున్నారు ప్రేక్షకులు. అదీ స్క్రీన్ ప్రెజెన్స్‌లో ప్రభాస్‌కున్న ఛరిష్మా.

బాహుబలి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్నారు. వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ రీజనల్ స్టార్స్‌కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్‌కు కూడా ఒక నెరవేరని కల, సాధ్యం కాని ఫీట్. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల గ్రాస్ మూవీస్ చేశాడు. బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. కల్కి 2898 ఏడి మూవీ 1100 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం విశేషం. అందుకే వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రభాస్‌తో భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నాయి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు.

మారుతి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా…ప్రభాస్ చేస్తున్న భారీ సినిమాలు. వీటిలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. మిగతా మూవీస్ చిత్రీకరణలో వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఏ ప్రకృతి విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. ఈ ఏడాది కేరళలోని వయనాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. అలాంటి గొప్ప మనసున్న గొప్ప పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బుధవారం తన బర్త్‌డేను ఘనంగా జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి బర్త్ డే విషేష్ వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News