Friday, October 18, 2024

విందు భోజనంలా ‘క్రాక్’

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా హీరో రవితేజతో ఇంటర్వూ విశేషాలు…

హ్యాట్రిక్ హిట్‌ను అందుకుంటా…
గోపీచంద్ మలినేని, నా కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. ‘క్రాక్’తో తప్పకుండా హ్యాట్రిక్ హిట్‌ను అందుకుంటాము. ఈ సినిమా ఒక విందు భోజనంలా ఉంటుంది.
న్నీ బాగా కుదిరాయి…
ఈ పండుగకు వస్తున్న వస్తున్న పక్కా కమర్షియల్ ఫిలిం ఇది. ప్రేక్షకులు నా క్యారెక్టర్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. మాస్ ఎలిమెంట్స్, పాటలు బాగా కుదిరాయి. సినిమా చాలా బాగా వచ్చింది.
సమ్‌థింగ్ స్పెషల్‌గా…
ఈ సినిమాలో నా క్యారెక్టర్ డబుల్ మాస్ లేదా త్రిబుల్ మాస్ అనేది చిత్రం విడుదలయ్యాక తెలుస్తుంది. నా కెరీర్‌లో ఈ మూవీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది.
యదార్థ సంఘటనలతో…
ఈ సినిమాలో శృతిహాసన్ చాలా మంచి క్యారెక్టర్ చేసింది. అలాగే సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్రలు ఆకట్టుకుంటాయి. యదార్థ సంఘటనలు, రియల్ క్యారెక్టర్స్‌ను తీసుకొని చేసిన సినిమా ఇది.
అద్భుతమైన స్పందన…
నా కెరీర్ మొదట్లో సంగీత దర్శకుడు చక్రితో ఎక్కువ సినిమాలు చేశాను. ఆతర్వాత ఎక్కువ సినిమాలు చేసింది తమన్‌తోనే. నాకు ఎలాంటి పాటలు ఇవ్వాలో అతనికి బాగా తెలుసు. ఈ సినిమాలో అతనిచ్చిన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది.

Hero Ravi Teja Interview about KRACK Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News