Sunday, December 22, 2024

తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ పెళ్లి?

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ఒకడైన హీరో శర్వనంద్ పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కోడుతోంది. ఓ ఎన్ఆర్ఐ మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు వీడియాలో కథనాలు వస్తున్నాయి. తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ అమ్మాయి అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసి, హైదరాబాద్ కు తిరిగి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే కాదని, తాను ప్రేమించిన అమ్మాయినే ఇలా అరెంజ్డ్‌ మ్యారెజ్‌గా సెట్ చేశాడన్న వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అయితే ఆ అమ్మాయి ఎవరు..? పేరేంటి..? పెళ్లి ఎప్పుడు అనే విషయాలను శర్వానంద్ త్వరలో ప్రకటించున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ షోలో శర్వానంద్ పెళ్లి ప్రస్థావన తీసుకొచ్చాడు. దీనికి ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే తాను కూడా చేసుకుంటానని బదులిచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News