Sunday, December 22, 2024

‘కంగువా’ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. గాయపడిన హీరో సూర్య!

- Advertisement -
- Advertisement -

‘కంగువా’ మూవీ షూటింగ్‌లో హీరో సూర్య గాయపడ్డారు. చెన్నైలో ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను మేకర్స్ చీత్రికరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. హీరో సూర్యపై యాక్షన్ సీన్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తు రోప్ కెమెరా ఆయన మీద పడడడంతో స్వల్పంగా గాయడినట్లు తెలుస్తోంది. సూర్య భుజంపై కెమెరా పడడంతో షూటింగ్ నిలిపివేసి చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారట. చికిత్స అనంతరం సూర్యకు వారం రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది. దీంతో ఆయన కోలుకున్న తర్వాతనే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని చిత్రయూనిట్ చెప్పినట్లు సమాచారం. అయితే, సూర్య గాయపడినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, ‘కంగువా’ మూవీ సూర్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ లెవల్ లో రూపొందుతుంది. ఈ మూవీకి త‌మిళ స్టార్ దర్శకుడు శివ‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై అభిమానులతోపాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News