Wednesday, January 22, 2025

జనసేన అభ్యర్థికి మద్దతు ప్రకటించిన హీరో సుమన్

- Advertisement -
- Advertisement -

జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి సీనియర్ హీరో సుమన్ తన మద్దతును ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ను సుమన్ కలిశారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్‌ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బొలిశెట్టికి మద్దతు తెలుపుతన్నట్లు వెల్లడించారు. ఆయన విజయానికి తన వంతు కృషి చేస్తానని సుమన్ చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడన్నారు. కాబట్టి ఇలాంటి నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని సుమన్ అన్నారు.

కాగా, ఎపిలో టిడిపి-జనసేన-బిజెపి జట్టు కట్టడంతో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీని ఓడించి.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ లు కలిసి బిజెపితో పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు ఎంపి స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. ఇందులో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రకటించిన అభ్యర్థులతోపాటు మరో తొమ్మిది స్థానాల్లో అక్కడి అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేసుకోవాలని చెప్పనట్లు సమాచారం. దీంతో జనసేన అభ్యర్థులు ప్రచారాలు ప్రారంభించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో బొలిశెట్టి ప్రచారం చేస్తూ తను ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రజల మధ్యకు వెళ్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News