Thursday, January 23, 2025

అభిమానులకు విందు ఇచ్చిన తమిళ స్టార్ హీరో సూర్య!

- Advertisement -
- Advertisement -

ఎవరికైనా ఆపద వస్తే ముందుకు దూకి ఆదుకునేవారిలో తమిళ హీరో సూర్య ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఆయన తన అభిమానులకు భారీ విందు ఇచ్చాడు. మిగ్ జాం తుఫాను వచ్చినప్పుడు బాధితులకు సూర్య, అతని సోదరుడు హీరో కార్తీ 10 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. అలాగే సూర్య పిలుపు మేరకు వేలాదిమంది అభిమానులు రంగంలోకి దిగి బాధితులను ఆదుకున్నారు.

తన అభిమానులకు కృతజ్ఞత తెలుపుకునేందుకు సూర్య వారికి విందు ఇచ్చాడు. ఆహార పదార్ధాలను సూర్య స్వయంగా వడ్డిస్తూ, అభిమానులతో ముచ్చటించాడు. అలాగే గత రెండేళ్లలో పెళ్లి చేసుకున్న 50మంది అభిమానులను కూడా ఈ సందర్భంగా కలుసుకుని, అభినందనలు తెలిపాడు. తమిళనాడులోని ట్యూటికోరన్, తిరునెల్వేలి జిల్లాల్లో గత ఏడాది వచ్చిన మిగ్ జాం తుఫాను వల్ల వేలాదిమంది జీవితాలు కకావికలమయ్యాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకోవడంలో సూర్య అభిమానులు కీలకపాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News