Wednesday, January 22, 2025

హీరో వెంకటేశ్ ఇంట్లో మోగుతున్న పెళ్లి బాజాలు

- Advertisement -
- Advertisement -

హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన కుమార్తె హయవాహిని వివాహానికి శుక్రవారమే ముహూర్తం. విజయవాడకు చెందిన ఒక డాక్టర్ తో ఆమె వివాహం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారంనాడు మెహందీ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మహేశ్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వివాహం జరుగుతుంది.

వెంకటేశ్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా పెద్ద కుమార్తెకు ఇప్పటికే వివాహమైంది. హయవాహిని.. వెంకటేశ్ దంపతుల రెండో కుమార్తె.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News