Thursday, December 12, 2024

హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ రేంజ్..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ వాహనాల కంపెనీ హీరో ఇటీవలే భారతీయ మార్కెట్లో యాక్టివ్ E, QC1 ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తర్వాత హీరో మోటోకార్ప్ Vida V2 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను పెంచుకోవడానికి V2 సిరీస్‌ని తీసుకువచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమూవబుల్ బ్యాటరీ సపోర్టును తీసుకువచ్చిందని కంపెనీ పేర్కొంది. పొందుతోంది. ఈ క్రమంలో విడా వి2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

డిజైన్

విడా వి2 లైనప్ రెండు రంగు ఎంపికలలో తీసుకువచ్చింది కంపెనీ. అవి మాట్ నెక్సస్ బ్లూ-గ్రే, గ్లోసీ స్పోర్ట్స్ రెడ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వి1 తో పోలిస్తే దీని డిజైన్ లో కొంతవరకు మార్పులు తీసుకువచ్చారు. ఇదే సమయంలో దీని ఫ్రంట్ టర్న్ సూచికలు కూడా కొత్త డిజైన్‌లో కనిపిస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సైడ్ బాడీ ప్యానెల్‌పై వి1కి బదులుగా వి2 బ్యాడ్జ్ ఉంటుంది. ఒక్కమాటల్లో చెప్పాలంటే విడా వి 2 శ్రేణి డిజైన్ వి1 శ్రేణిని పోలి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్పెషల్ ఏంటంటే రిమూవబుల్ బ్యాటరీ సపోర్టును పొందుతోంది. కంపెనీ తన మునుపటి వి1 శ్రేణి వలె వి2 లైనప్ ఎర్గోనామిక్స్, రైడ్ హ్యాండ్లింగ్, పనితీరుపై అదే దృష్టిని ఉంచింది.

బ్యాటరీ, రేంజ్

హీరో విడా వి2 బ్యాటరీ గురుంచి మాట్లాడితే.. రిమూవబుల్ IP67-రేటెడ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. విడా వి2 లైట్ 2.2 kWh సామర్థ్యం గల అతి చిన్న బ్యాటరీని కలిగి ఉంది. ఇదే సమయంలో వి2 ప్లస్ బ్యాటరీ పరిమాణం 3.44 kWh ఇవ్వబడింది. మరోవైపు వి2 ప్రో 3.94 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్ తర్వాత 165 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో అందించిన బ్యాటరీ 6 kW గరిష్ట శక్తిని, 25 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, విడా వి2 కేవలం 2.9 సెకన్లలో 0-40 km/h వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 90 km/h.

ధర

హీరో విడా వి2 భారత మార్కెట్లో V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే మూడు వేరియంట్‌లలో విడుదల అయింది. వి2 లైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,000గా, వి2 ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,15,000గా, వి2 ప్రో ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,35,000 గా కంపెనీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News