Thursday, December 26, 2024

పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్

- Advertisement -
- Advertisement -

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్‘. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌లో ‘తుఫాన్‘ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. ‘తుఫాన్‘ సినిమాను ఆగస్టు 2న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత జి.ధనుంజయన్ మాట్లాడుతూ “‘తుఫాన్‘ ఒక క్వాలిటీ, కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా. మ్యూజిక్‌తో పాటు మంచి డైలాగ్స్ ఉంటాయి.

విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో అందరినీ ఆకట్టుకుంటారు”అని తెలియజేశారు. డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ – “అచ్చు రాజమణి మ్యూజిక్ ‘తుఫాన్‘ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా విజయ్ ఆంటోనీ తన సపోర్ట్ నాకు ఇస్తూనే ఉన్నారు”అని అన్నారు. హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “డైరెక్టర్ విజయ్ మిల్టన్ మంచి స్క్రిప్ట్ ఈ మూవీకి రాశారు.

ఈ మూవీని తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది”అని తెలిపారు. సత్యరాజ్ మాట్లాడుతూ – “నా క్యారెక్టర్‌ను దర్శకుడు విజయ్ మిల్టన్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. నా లుక్, మేకోవర్ అంతా కొత్త ఉంటుంది. నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ తుఫాన్‌”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కరుణాకరన్, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి, మాటలు, పాటల రచయిత భాష్యశ్రీ, సాకేత్ కొమండూరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News