Thursday, January 23, 2025

తమిళనాడులో విశాల్ రాజకీయ అరంగ్రేటం…

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. విజయ్ కొత్త పార్టీని ప్రకటించిన వారంలోనే మరో నటుడు  విశాల్ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం తన అభిమాన సంఘం విశాల్ మక్కల్ నల ఇయక్కం నేతలతో విశాల్ సమావేశం కానున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే విశాల్ పోటీ చేయనున్నారు. ఇప్పటికే స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కజగం పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. విశాల్ గతంలోనే ఎన్నికలలో పోటీ చేశారు. చెన్నైలోని ఆర్‌కె నగర్ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. విశాల్ నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ కొన్ని కారణాలతో అప్పుడు తిరస్కరించింది. విశాల్ పీపుల్స్ హెల్త్ మూమెంట్ పేరుతో సేవా కార్యక్రమాలు చేశాడు, చెన్నైలో వరదలు సంభవించినప్పుడు కూడా పేద ప్రజలకు ఆయన సహాయం చేశారు.

గతంలో ఎంజిఆర్ అన్నాడిఎంకె పార్టీ పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడు. అన్నాదురై, కరుణానిది సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చి సక్సెస్ అయ్యారు. తమిళనాడులో ఉన్న డిఎంకె ప్రభుత్వంలో ఉదయనిధి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ తరువాత ఉదయనిదిదేనని రాజకీయ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ నటులు శివాజీ గణేశన్, కార్తీక్, శరత్ కుమార్, కుమరేశన్ దురైసామి, కెప్టెన్ విజయ్ కాంత్, కమల్ హాసన్‌లు పార్టీలు పెట్టారు కానీ సక్సెస్ కాలేకపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News