Sunday, January 19, 2025

మహిళతో విశాల్ వీడియో వైరల్.. క్షమించమన్న హీరో

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్‌లో మహిళతో ప్రముఖ నటుడు విశాల్ ఉన్న వీడియో నిన్న ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఇది వీక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో విశాల్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించారు విశాల్.

అందరూ నన్ను క్షమించండి. వైరల్ అవుతున్న వీడియో గురించి నిజాన్ని వెల్లడించడానికి ఇది సమయం అని నేను అనుకుంటున్నాను. సరే, లొకేషన్ పరంగా ఇది నిజం, అవును నేను న్యూయార్క్‌లో ఉన్నాను. నా ఒత్తిడిని తగ్డించుకోడానికి, సంవత్సరం అంత పడిన కష్టాన్ని మర్చిపోవడానికి కజిన్స్ తో కలిసి తరుచూ న్యూయార్క్ కు వెళ్తుంటామని విశాల్ వెల్లడించారు.

ఆ వీడియోలో మొహం కనబడకుండా దాచుకున్నానంటే అదొక ప్రాంక్. క్రిస్మస్ రోజు నాతో సరదాగా మా కజిన్స్ అందరూ ప్రాంక్ వీడియా చేశారన్నారు. నన్ను ఆటపట్టించడం కోసం చేశారంతే. అలా చేయాలని నాతో చెప్పి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా దానిపై వస్తున్న ఊహాగానాలకు తెరపడిందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కొంతమంది ఆ వీడియోను చూసి నన్ను టార్గెట్ చేసి మట్లాడుతున్నారు, కానీ నేను ఎవరినీ ద్వేషించాలని అనుకోవడం లేదంటూ విశాల్ తన పోస్టులో పేర్కొన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News