Monday, December 23, 2024

అతన్ని ప్రేమించా: హీరోయిన్ లక్ష్మీ మీనన్

- Advertisement -
- Advertisement -

తాను ఒకతన్ని ప్రేమించానని.. కానీ అతను వేరే పెళ్లి చేసుకున్నాడని తెలిపింది మలయాళి హీరోయిన్ లక్ష్మీ మీనన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీరేవరినైనా ప్రేమించారా? అని అడగగా.. తన ప్రేమకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

స్కూల్ లో తన క్లాస్ మేట్ ఒకతను నచ్చడంతో.. అతడిని ప్రేమించానని.. కొన్ని రోజుల తర్వాత అతని వద్దకు వెళ్లి ప్రేమిస్తున్నట్లు చెప్పానని..అయితే అతను వెంటనే అంగీకరించలేదని తెలిపింది. కొంత కాలం తర్వాత తన ప్రేమను అంగీకరించాడని చెప్పింది. అయితే, తామిద్దరం సినిమాలో లాగా తరచూ కలుసుకోవడం, బయటికి వెళ్లడం వంటివి చేయలేదని… కాకపోతే అప్పడప్పుడు మాట్లాడుకునేవారమని చెప్పింది. తర్వాత ఫోన్లలోనూ మాట్లాడుకునే వాళ్లమని తెలిపింది. అయితే, స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తైన తర్వాత ఇద్దరం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని.. అలా మా మధ్య ప్రేమ కూడా తగ్గిపోయిందని వెల్లడించింది. ఇటీవల అతను పెళ్లి కూడా చేసుకున్నాడని తన తొలి ప్రేమ గురించి చెప్పుకొచ్చింది లక్ష్మీ మీనన్.

ఇక, సినిమాల విషయానికి వస్తే.. లక్ష్మీ మీనన్, ఇటీవలే విడుదలైన చంద్రముఖి2 చిత్రంలో నటించింది.అయితే, ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం పలు తమిళ చిత్రాలు లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News