Monday, December 23, 2024

శంషాబాద్ లో రూ. 41.3 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డిఆర్‌ఐ అధికారులు తనిఖీలలో ఓ మహిళా ప్రయాణీకురాలి వద్ద 5.9 కిలోల హెరాయిన్‌ను గుర్తించి, సీజ్ చేశారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ మార్కెట్లో రూ. 41.3 కోట్ల విలువ చేస్తుందని డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. హెరాయిన్ కలిగిన ప్రయాణీకురాలు మలానీ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సూట్‌కేసులో హెరాయిన్ తరలిస్తున్నట్లు తెలిపారు. సదరు మహిళా ప్రయాణీకురాలిని డిఆర్‌ఐ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News