Monday, December 23, 2024

అబ్బాయిలు అంటే ఇష్టం ఉండదు: హీరోయిన్ అతుల్య రవి

- Advertisement -
- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర హీరోయిన్ అతుల్య రవి మాట్లాడుతూ “పక్కా కమర్షియల్ మూవీ ‘మీటర్’. ఇందులో అద్భుతమైన ఎమోషన్స్ కూడా వున్నాయి. ఒక కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ వున్నపుడు అందరూ కనెక్ట్ అవుతారు. పాటలు కూడా చాలా బావుంటాయి. భారీ సెట్‌లో ఒక సాంగ్ చేశాం. డ్యాన్సులు కూడా బావుంటాయి. మాస్ ఫైట్స్, రోమాన్స్, లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో పాటు ఫాదర్ సెంటిమెంట్ కీలకంగా వుంటుంది.

ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా వుంటుంది. అబ్బాయిలు అంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తా. నా పాత్ర సీరియస్‌గా వుంటుంది. కానీ అందులో నుంచే కామెడీ ఉంటుంది. నా పాత్ర ఫస్ట్ హాఫ్‌లో చాలా కామెడీ వుంటుంది. సినిమాలో కిరణ్,  నాకు ఉన్న కాంబినేషన్ సీన్స్ చాలా సరదాగా వుంటాయి. హీరోయిన్‌ను ఫాలో చేసి టీజ్ చేయడం, ప్రేమించడం.. ఇలా హిలేరియస్ గా ఉంటుంది. మరో కోణంలో ఎమోషన్స్ , ఫైట్స్ మాస్‌గా ఉంటాయి. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఈ సినిమాని కిరణ్ అద్భుతంగా చేశారు” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News