Monday, December 23, 2024

హీరోయిన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెన్నై: కోలీవుడ్ హీరోయిన్ జెస్సిక అలియాస్ దీప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోలీవుడ్‌లోని వైతా చిత్రంలో దీప హీరయిన్‌గా నటించింది. కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేసింది. శనివారం ఆమెకు పలుమార్లు బంధువులు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ స్నేహితుడు ప్రభాకరన్‌ను ఫ్లాట్ పంపించారు. దీప ఉరేసుకొని కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీప సోదరుడు దీనేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె రాసిన సూసైడ్ లేఖలో తన చావుకు ఎవరు కారణం కాదంటూ పేర్కొంది. శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆమె సొంతూరు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఇంద్రానగర్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News