Wednesday, January 8, 2025

థ్రిల్లర్ కథాంశంతో…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పీసీ క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ చంద్ర నిర్మాతగా వరుణ్.కె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం భోగి. సస్పెన్స్ కధాంశంతో, యూత్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్, నిర్మాత డీఎస్ రావు, నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ మాట్లాడుతూ నలుగురు మహిళల నేపథ్యంలో థ్రిల్లర్ కధాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. నిర్మాత ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ అతి త్వరలో ట్రైలర్‌ను, ఆ తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News