Wednesday, January 22, 2025

కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ కీర్తీ సురేష్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.  ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని  నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయి నచ్చడంతో ఈ బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వరుడు బంధువేనట. ఈ డిసెంబర్ లోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరుకుటుంబాలతోపాటు సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో గోవాలో వీరి పెళ్లి జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వస్తే గానీ చెప్పలేము.

కాగా, గతంలో కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తో కీర్తి ప్రేమలో ఉందని.. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే, అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలల్లో వరుస సినిమాలతో కీర్తి బిజీగా ఉండటంతో పెళ్లి రూమర్స్ బ్రేక్ పడింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాలో నటిస్తున్న కీర్తి..సౌత్ కొత్త మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. దీంతో మళ్లీ కీర్తి పెళ్లిపై వార్తలు జోరందుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News