Tuesday, December 17, 2024

హిలేరియస్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

Heroine Lavanya Tripathi birthday celebrations

 

‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బుధవారం హీరోయిన్ లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News