Monday, December 23, 2024

బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

రాజ్ తరుణ్ హీరోగాఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ’తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకులముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తా. చాలా ఎనర్జిటిక్ హైపర్ యాక్టివ్ అమ్మాయి పాత్ర నాది. నా క్యారెక్టర్ కారణంగానే కథ అంతా జరుగుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా వుంటాయి. అలాగే నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా వుంది. అది బాలకృష్ణకి రిలేట్ అయ్యేలా వుంటుంది.

బాలకృష్ణ మాట్లాడినప్పుడు ఫిల్టర్ వుండదు. ఆయన మనసులో వున్నది వున్నట్లుగా మాట్లాడేస్తారు. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలానే వుంటుంది. నా క్యారెక్టర్ మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ ప్రాముఖ్యతని నేర్పించేలా వుంటుంది. తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. -రవికుమార్ చాలా మంచి విజన్ వున్న డైరెక్టర్. తను ఏదైతే చెప్పారో సరిగ్గా అదే ఎగ్జిక్యూట్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. -ఇందులో చాలా ఎమోషన్స్, యాక్షన్, డ్రామా, రోమాన్స్, ఫన్ ఎలిమెంట్స్ వున్నాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్‌కి క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. సైలెంట్‌గా మొదలై వయోలెంట్‌గా మారే క్యారెక్టర్ అతనిది. ఆడియన్స్ ఎంజాయ్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News