Monday, January 20, 2025

‘హిడింబ’ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ : హీరోయిన్ నందితా శ్వేత  

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే  విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ నందితా శ్వేత విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘హిడింబ’ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? ఇందులో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
డైరెక్టర్ అనీల్ గారు కథ చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఇది వరకు నేను కొన్ని థ్రిల్లర్స్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్. ఇందులో పోలీస్ రోల్ లో కనిపిస్తా. ఇది వరకే ఓ తమిళ్ సినిమాలో పోలీస్ రోల్ చేశాను. పోలీస్ రోల్ చేయాలంటే ఫిట్నెస్ వుండాలి. మొదటిసారి యూనిఫామ్ వేసుకున్నపుడు నాకు ఎలా వుంటుందో అనే సంకోచం, సిగ్గు వుండింది. ఐతే ‘హిడింబ’ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వుంది. హిడింబ చాలా యూనిక్ డిఫరెంట్ థ్రిల్లర్. ఇందులో నాది హీరోకి ఈక్వెల్ గా వుండే చాలా బలమైన పాత్ర. నేచురల్ గా వుండే చాలా సీరియస్ క్యారెక్టర్.  సినిమా విషయంలో చాలా పాజిటివ్ వైబ్ వుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా చేసినప్పుడు ఎలాంటి వైబ్ ఉండేదో అలాంటి వైబ్ వుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా లానే హిడింబ కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది.

ఈ పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు ?
మెంటల్ గా ఫిజికల్ గా ఇది సవాల్ తో కూడిన పాత్ర. నిజానికి నాది స్మైలీ ఫేస్, ఇందులో ఎక్కడ కూడా ఇలాంటి ఎక్స్ ప్రెషన్ చూడరు. ఇందులో హీరోకి నేను సీనియర్. నాపాత్రలో కమాండింగ్ వుంటుంది. నా ఆర్డర్స్ ని డిపార్ట్మెంట్ ఫాలో అవుతుంది. ఇంత స్ట్రాంగ్ రోల్ చేసినప్పుడు బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దర్శకుడు ఐపీసి సెక్షన్స్ గురించి కొన్ని డైలాగ్స్ రాశారు. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ఆ పాత్ర చేయడం ఛాలెజింగ్ అనిపించింది. ఐతే దర్శకుడు అనిల్ గారి సూచనలు సలహాలతో ఈ పాత్రని చేయడం సులువయింది. ఈ సినిమా కోసం స్పెషల్ గా వర్క్ అవుట్స్ చేశాను.

హిడింబ ట్రైలర్ చూస్తుంటే పాత్రలు, నేపధ్యం కొత్తగా వుంది. దిని ఇంపాక్ట్ ఎలా వుంటుంది ?
హిడింబ ఫిల్మ్ మేకింగ్ పరంగా చాలా క్యాలిటీగా వుంటుంది. చాలా డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ గారు చేసిన పని తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ‘హిడింబ’ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. ఖచ్చితంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు.

ఈ చిత్రానికి హిడింబ అనే టైటిల్ పెట్టడానికి కారణం ?
ఇది సస్పెన్స్. దీని గురించి ఎక్కువ రివిల్ చేయకూడదు. హిడింబ అనే పేరు ఎందుకుపెట్టామో సినిమా చుసిన తర్వాత మీకే అర్ధమైపోతుంది.

అశ్విన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించిది ?
అశ్విన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ కష్టం ట్రైలర్ లో మీకు కనిపించింది. ఇందులో మా మధ్య చాలా కాంబినేషన్ సీన్లు వుంటాయి. తనతో వర్క్ చేయడం మంచి అనుభవం.

హిడింబకి సీక్వెల్ ఉంటుందా ?
అది దర్శకుడు చెప్పాలి. నేనైతే యూనిఫామ్ కూడా దాచి పెట్టుకున్నాను.(నవ్వుతూ)

మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా ?
లేదండీ. అసలు సినిమా పరిశ్రమలోకి వచ్చి ఇన్ని పాత్రలు చేస్తానని అనుకోలేదు. ఇలాంటి పాత్రలే చేయాలనీ ప్రత్యేకంగా ఏమీ అనుకోలేదు, ఆశించలేదు. ఈ ప్రయాణంలో నాకు వచ్చిన పాత్రకు ఎంత న్యాయం చేయగలననే దానిపైనే ద్రుష్టి పెట్టాను. ‘హిడింబ’తో స్టార్ డమ్ వస్తుందనే నమ్మకం వుంది.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు గురించి?
అజయ్ భూపతిగారి ‘మంగళవారం’ సినిమా చేస్తున్నా. అలాగే తమిళ్ లో మూడు చిత్రాలు, తెలుగులో మరో రెండు చిత్రాలు చేస్తున్నా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News