అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్వీసీ—ఎఫ్ఈఈ బ్యానర్లపై దిల్‌రాజు, దర్శకుడు క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రుహానీ శర్మ మీడియాతో మాట్లాడుతూ “అవసరాల శ్రీనివాస్ నటుడిగా, డైరెక్టర్‌గానే కాదు, మంచి రైటర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా కథను ఆయన నాకు చెప్పారు. నా క్యారెక్టర్‌తో పాటు అవసరాల క్యారెక్టతోనూ బాగా కనెక్ట్ అయ్యాను. నాకు తెలిసి అందమంటే మనం అంతర్గతంగా ఎలా ఉంటామో అదే.
మనం చూడటానికి ఎంత గొప్పగా ఉన్నామనేది అందం కాదనేది నా అభిప్రాయం. మనల్ని మనం ఒప్పుకునే తత్వమే అందం. ఇక బట్టతలతో ఉండే ఓ యువకుడు అలా ఉండటానికి ఇష్టపడడు. అయితే దాని వల్ల అతనెలాంటి పనులు చేశాడు? చివరకు అతనికి ఏం తెలిసింది? తనను తాను ఎలా ప్రేమించుకున్నాడనేదే ఈ సినిమా కథ. అవసరాల శ్రీనివాస్, నా పాత్ర చుట్టూనే ఈ సినిమా ఎక్కువగా రన్ అవుతుంది. నా పాత్ర ఏంటనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. హీరో జర్నీలో హీరోయిన్ పాత్ర ఏంటి? ఆమె కోసం హీరో ఎలా మారాడు? అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకు నా పాత్ర ఆత్మ అనుకోవచ్చు. ప్రస్తుతం – తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ నటిస్తున్నాను. హిందీలో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. మలయాళంలోని ఓ మూవీలో డార్క్ క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది. – నాని ప్రొడక్షన్లోని ‘మీట్ క్యూట్’లో నటించాను”అని అన్నారు.