Monday, January 20, 2025

హీరోయిన్ కిడ్నాప్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుమార్ vs కుమారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ బ్యూటీ సునయన. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసును దోచుకుంది. తెలుగు పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలతో దూసుకెళ్తుంది. తాజాగా గత రెండు రోజులుగా సునయన కనిపించడం లేదని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సునయన కిడ్నాప్ అయినట్లు ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నట్లు వార్త వైరల్ గా మారింది. తీరా చూస్తే ఇదంతా ప్రాంక్ అని తెలిసింది. ప్రమోషన్ల విషయంలో చిత్రం బృందం హీరోయిన్ కిడ్నాప్ అయినట్లుగా ఒక వార్తను లీక్ చేసినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News