Tuesday, April 15, 2025

కొత్తపేటలో విశిష్ట గోల్డ్ షోరూమ్‌ను ప్రారంభించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య

- Advertisement -
- Advertisement -

విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్‌ను ప్రముఖ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రారంభించారు. కొత్తపేటలో శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కమాన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ 2వ షోరూమ్‌ను ప్రముఖ హీరోయిన్ వైష్ణవి చైతన్య ముఖ్యతిథిగా హాజరై ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యత, మన్నికతో కూడిన బంగారు ఆభరణాలను అందజేయడమే విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ప్రత్యేకత అన్నారు. విశిష్ట సీఈఓ డైరెక్టర్ సింధుజా, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్‌లు మాట్లాడుతూ ప్రతి ఆభరణాన్ని అత్యున్నత నైపుణ్యం కలిగిన కారిగులు శ్రద్ద్ధతో డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, టిపిసిసి ప్రచార కమిటి కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, కార్పొరేటర్లు రంగా నర్సింహ్మ గుప్తా, రాధ ధీరజ్‌రెడ్డి, ఎల్బీ కుమార్, కాచం సత్యనారాయణ గుప్తాలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News