Monday, December 23, 2024

మెడికల్ స్టూడెంట్ గా యుక్తి తరేజ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి కాంబినేషన్‌లో వస్తున్న పూర్తి ఎంటర్‌టైనర్ ‘రంగబలి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈనెల 7న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ యుక్తి తరేజ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఇది నా మొదటి తెలుగు సినిమా. నా మొదటి సినిమాకే నాగశౌర్యతో పాటు మంచి నిర్మాణ సంస్థలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలో నేను మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తా. నా పాత్ర పేరు సహజ. తనది చాలా కూల్ క్యారెక్టర్. నాగశౌర్య గ్రేట్ కో స్టార్. ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభవాన్నిచ్చింది. నా మాతృభాష హిందీ. తెలుగులో పెద్ద డైలాగులు నేర్చుకొని చెప్పడం కొంచెం ఛాలెంజ్ గా అనిపించింది. అయితే దర్శకుడు పవన్ స్క్రిప్ట్‌ని ముందే ఇచ్చేవారు. దాని వలన నాకు సీన్ పై ఒక అవగాహన వచ్చేది. పవన్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News