Saturday, June 29, 2024

అందరి కళ్లూ రఫాపైనే.. నెత్తుటి కన్నీటిపైనే హీరోయిన్స్ ఆవేదన

- Advertisement -
- Advertisement -

గాజా: ప్రపంచస్థాయి యుద్ధాల మారణహోమాల నేపథ్యంలో ఇప్పుడు గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ దాడులలో దారుణాలపై తీవ్రస్థాయి ఆందోళన ఆవేదన వ్యక్తం అవుతోంది. ఆల్ ఐస్ ఆన్ రఫా పేరిట సెలబ్రిటిలు, ప్రత్యేకించి సినిమా అందాల తారలు తమ ఆవేదనాయుత స్పందన తెలియచేస్తున్నారు.

ఇది యుద్ధం కాదు మారణహోమమే అని పేర్కొంటు సినీనటి త్రిష, సమంత, మాళవిక మెహనన్, రష్మిక, దుల్కర్ సల్మాన్, పార్వతి తిరువొత్తు, ప్రియాంక ఇతరులు సోషల్ మీడియాలో ఈ ఉన్మాదం నిలిపివేయాలని, ఇంతటి ఘోరం జరుగుతూ ఉంటే, తల్లులను కోల్పోయి పిల్లలు, పిల్లలు తమ కళ్ల ముందే ప్రాణాలు పోగొట్టుకుంటే తల్లులు కన్నీళ్లు కూడా లేని స్థితిలో మూగవేదన అనుభవిస్తున్నారని పేర్కొంటూ ఈ రఫా రక్షణ ఉద్యమానికి పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేశారు.

ప్రభుత్వాలు ఎన్నికలు ఇతరత్రా విషయాలపై దృష్టి పెట్టి, ఇంతటి దారుణ పరిస్థితి గురించి విస్మరించరాదని తోటి ప్రాణి ఏ విధంగా తల్లడిల్లుతున్నదో ఓసారి చూసి, స్పందించి ఆదుకోవాలని, ముందు అక్కడ దాడులు ఆగాల్సి ఉంది. కాల్పులవిరమణకు ప్రపంచ న్యాయస్థానం ఇతర ప్రపంచవేదికలు ఇస్తున్న పిలుపును దాడితులు వెంటనే మన్నించేలా వారిని అన్ని విధాలుగా కట్టడి చేయాలని, బాధితుల పక్షాన నిలవాల్సి ఉందని సినీతారలు పిలుపు నిచ్చారు. శరణార్థ శిబిరాలపై దాడులు, సాయానికి తరలివస్తున్న అంతర్జాతీయ స్థాయి సామాగ్రి తరలింపు శకటాల లూఠీ, వాటి విధ్వంసం, రక్షణ ప్రాంతాలు, శిబిరాలు వంటివి కూడా పట్టించుకోకుండా సాగుతున్న దాడులకు అంతం పలకాల్సి ఉందని పేర్కొంటూ మండుతున్న రఫా నేపథ్యంలో ఆల్ ఐస్ ఆన్ రఫా అనే పోస్టును తొలుత యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న నటి ప్రియాంక వెబ్‌సైట్‌లో పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News