Monday, January 20, 2025

ప్రేమదేశం ఆఫర్‌ను కాలదన్నుకున్న హీరోయిన్లు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ప్రతి బియ్యం గింజ మీద తినేవాడి పేరు రాసుంటుందన్నది పెద్దల మాట. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ప్రాప్తం అన్నది జగమెరిగిన సత్యం. అవకాశాలు రావడ ఒక ఎత్తయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. ఇవి సినిమా ఇండస్ట్రీకి చక్కగా సరిపోయే కొటేషన్లు. వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకుని ఆ తర్వాత బాధపడిన సినీతారలు ఎందరో ఉంటారు. ఆ టైమ్‌లో అది వారికి కరెక్ట్ డెసిషన్ అనిపించవచ్చు.

తాను తీసే సినిమా హిట్ కొడుతుందన్న నమ్మకం ప్రతి దర్శకుడికీ ఉంటుంది. అయితే సినిమా షూటింగ్‌లోనే కొన్ని సినిమాల జాతకాలు తెలిసిపోతుంటాయి. దర్శకుడు తాను అనుకున్న కథను అనుకున్నట్టుగా తీయగలిగితే కనీసం తాను నమ్మిన కథను తీశానన్న తృప్తి అయినా అతనికి మిగులుతుంది. కాని.. నిర్మాత.. హీరోల సలహాలకు తలొగ్గి కథలో రాజీపడిన దర్శకలు తమ సినిమాల మీద షూటింగ్‌లోనే ఆశలు వదులుకున్న సందర్భలాలూ ఉన్నాయి. అయితే కథనే నమ్ముకుని హిట్ కొటిన దర్శకుల జాబితాలో తమిళ దర్శకుడు కదిర్‌ది ప్రత్యేక స్థానం ఉంది.

స్టార్‌లను నమ్మకుండా కొత్తవారితోనే సినిమాలు తీసి హిట్ కొట్టాలనుకోవడం కదిర్ ప్రత్యేకత. తన మొదటి సినిమా ఇదయం(తెలుగులో హృదయం) విషయంలో హీరోగా మురళిని తీసుకున్నప్పటికీ తర్వాతి చిత్రాలలో మాత్రం కదిర్ కొత్త వారితోనే పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆయన తెరకెక్కించిన చిత్రాలు ప్రేమదేశం, ప్రేమికుల రోజు. అప్పట్లో ఈ చెండు చిత్రాలు జనాదరణ పొందినవే. ముఖ్యంగా యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ప్రేమదేశం చిత్రానికి వస్తే ఆ చిత్రంలో ఇద్దరు హీరోలలో ఒకరిగా యాడ్ ఫిల్మ్‌లో నటించిన అబ్బాస్‌కు అవకాశం ఇవ్వాలని కదిర్ నిర్ణయించుకున్నారు. రెండో హీరో కోసంఅన్వేషిస్తున్న సమయంలో నిర్మాత కుంజుమోన్ సన్నిహితుల సలహా మేరకు మలయాళంలో ఒకటి రెండు సినిమాల్లో నటించిన వినీత్‌ను తీసుకున్నారు.

ప్రేమదేశం కథను రాసుకున్నపుడు ఈ సినిమాను తానే సొంతంగా నిర్మించాలని కదిర్ భావించారు. అందుకోసం ఫైనాన్స్ కోసం నిర్మాత కెటి కుంజుమోన్‌ను కలిశారు. తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని కుంజుమోన్ చెప్పినప్పటికీ తనకు రూ. 1.20 కోటి ఫైనాన్స్ ఇస్తే చాలని, తానే ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నానని కదిర్ చెప్పేశారు. కాలేజ్ సెట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసి అందులోనే షూటింగ్ పూర్తిచేయాలన్నది కదిర్ ఆలోచన. కుంజుమోన్ ఫైనాన్స్ ఇవ్వడానికి ఒప్పుకున%E

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News