హైదరాబాద్: సీనియర్ నటి జమున శుక్రవారం ఉదయం కన్నుమూశారు. జమున మృతి పట్ల సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టాలీవుడ్ నటులు చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎన్‌టిఆర్, మహేష్ బాబు, తదితరలు సంతాపం ప్రకటించారు. జమున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున తెలుగువారి మనసుల్లో చెరగని ముద్ర వేశారని నటుడు చిరంజీవి తెలిపారు. జమున 30 సంవత్సరాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మహారాణిలాకొనసాగారని జూనియర్ ఎన్‌టిఆర్ తెలిపారు. వైవిధ్యమైన పాత్రలతో మనసుల్లో చెరగని ముద్రవేశారని జూనియర్ ప్రశంసించారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రతిభాశాలి జమున అని నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. సత్యభామ పాత్రకు జమున జీవం పోశారన్నారు.
1959 నుంచి 15 ఏళ్ల పాటు జమున వెండితెరను ఏలారు. జమునను కొన్నాళ్లు ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్ పక్కనపెట్టారు. అప్పట్లో కొత్త నటులు హరినాథ్, జగ్గయ్య, కైకాల సత్యానారాయణ, కృష్ణం రాజు, శోభన్‌బాబులతో నటించారు. మూగమనుసులులోని గౌరీ పాత్రకు జమునకు ఎన్నో ప్రశంసలు పొందాయి. జమున నటించిన హిందీ సినిమాలు నయా ఆద్మీ, మిస్ మేరీ పెద్ద హిట్‌గా నిలిచాయి. తెలుగు చిత్రసీమతో అనుబంధం వల్ల హిందీ సినిమాలు తిరస్కరించారు. గుండమ్మ కథ, గులేబకావళి కథలో వెండితెరపై వెన్నెల వర్షం కురిసింది.
అద్భుతమైన నటన కౌశలంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు తెర సత్యభామగా జమున పేరు తెచ్చుకున్నారు. శ్రీకృష్ణా తులాభారంలోని సత్యభామ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజజీవితంలో మాత్రం మృదుస్వాభావిగా పేరు తెచ్చుకున్నారు. మూగమనుసులులో అమాయక పల్లెపడుచు పాత్రలో ఆమె జీవించారు. గోదారి గట్టుంది… గట్టుమీద పిట్టుంది అనే పాట ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూగనోములో ఎస్‌విఆర్‌తో పోటీపడి జమున నటించారు. పండంటి కాపురంలో రాణిమాలినీదేవి పాత్ర ఆమె కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఉంటుంది. సంపూర్ణ రామాయణంలో కైకేయి పాత్రతో విశ్వరూపం చూపించింది. తొలినాళ్లలో అండగా నిలిచిన వారిని ఆదుకున్నారు.