Wednesday, November 6, 2024

డీలర్ల లైసెన్సులు రద్దుకు వెనుకాడం: మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పత్తి విత్తనాల కొరత, అధిక ధరకు విక్రయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం స్పందించారు. పత్తి విత్తనాలు అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 450 గ్రాముల ప్యాకెట్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 853 గరిష్ఠ ధర నిర్ణయించింది. ధరల నియంత్రణ మాత్రం రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కొన్ని కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్ముతున్నాయని ఆరోపించారు. అలాంటి కంపెనీల డీలర్ల లైసెన్సులు రద్దుకు కూడా వెనుకాడమని మంత్రి నిరంజన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News