- Advertisement -
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి తొలిసారిగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, తొలి సాంగ్ ‘సిత్తరాల సిత్రావతి’కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ “హే బుజ్జి బంగారం” అనే మెలోడీని మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీకి సంగీతం అందిస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్ సారథ్యంలో ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఎంతో అందంగా ఆలపించారు. యూత్ ఫుల్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
- Advertisement -