Wednesday, January 22, 2025

ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా డ్రోన్ల దాడి

- Advertisement -
- Advertisement -

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లెబనాన్ మిలిటెంట్ గ్రూపు హెజ్‌బొల్లా సోమవారం ఉదయం ఉత్తర ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడి చేశామని ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించింది. ఈ దాడికి కేవలం ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. గతవారం లెబనాన్ లోని సీనియర్ హెజ్‌బొల్లా కమాండర్, ఇరాన్‌లో హమాస్ టాప్ పొలిటికల్ లీడర్ హతం కావడంతో దానికి ప్రతీకారంగా హెబ్‌బొల్లా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.

దక్షిణ లెబనాన్‌లో అనేక గ్రామాలపై ఇజ్రాయెల్ దాడులు సాగించడమే కాక, హత్యలకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్‌లో సైనిక స్థావరాన్ని లక్షంగా చేసుకున్నట్టు ఇరాన్ మద్దతు గల హెజబొల్లా వెల్లడించింది. అయితే ఈ దాడి బీరట్‌లో గతవారం హెజ్‌బొల్లా కమాండర్ ఫౌయద్ షుకుర్ హత్యకు తీవ్ర ప్రతీకారంలో భాగంగా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం సెమెట్రీకి సమీపాన మెయిస్సా అల్ జబాల్ గ్రామంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ అధికార మీడియా ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News