Saturday, December 21, 2024

హెజ్బొల్లా ప్రధాన ప్రతినిధి హతం

- Advertisement -
- Advertisement -

నెల రోజుల పైగా తరువాత మధ్య బీరూట్‌లో ఇజ్రాయెలీ తొలి వైమానిక దాడిలో లెబనాన్ హెజ్బొల్లా తీవ్రవాద బృందం ప్రధాన అధికార ప్రతినిధి మరణించినట్లు ఆ బృందం అధికారి ఒకరు ‘ఎపి’ వార్తా సంస్థతో చెప్పారు. ఇంతకు ముందు గాజా ప్రాంతంలో ఇజ్రాయెలీ దాడుల్లో 12 మంది మృతిచెందినట్లు పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు. మీడియాతో మాట్లాడే అధికారం తమకు లేనందున పేరు వెల్లడి చేయరాదనే షరతుతోహెజ్బొల్లా అధికారి మధ్య బీరూట్‌లో దాడిలో మొహమ్మద్ అఫీఫ్ హతుడైనట్లు చెప్పారు. అంతకు ముందు పలు భవనాలను ఖాళీ చేయవలసిందని ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించిన

తరువాత ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు బీరూట్ దక్షిణ శివార్లపై బాంబుల వర్షం కురిపించాయి. దహియెహ్‌గా పేర్కొంటున్న ఆ ప్రాంతంలో హెజ్బొల్లా తీవ్రవాద బృందానికి గట్టి పట్టు ఉన్నది. యుఎస్ ఆధ్వర్యంలో కాల్పుల విరమణ ప్రతిపాదనను లెబనాన్ అధికారులు పరిశీలిస్తున్న సమయంలో ఇజ్రాయెలీ దాడులు చోటు చేసుకున్నాయి. ఇది ఇలా ఉండగా, సీజరియా తీరప్రాంత నగరంలోని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రైవేట్ నివాసంపైకి మంటల వస్తువులను దుండగులు విసిరిన అనంతరం ముగ్గురు అనుమానితులను తాము అరెస్టు చేసినట్లు ఇజ్రాయెలీ పోలీసులు ఆదివారం తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News