Sunday, January 5, 2025

లెబనాన్‌లో సమాధుల కింద హెజ్బొల్లా భారీ సొరంగం

- Advertisement -
- Advertisement -

లెబనాన్‌లో సమాధుల కింద ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా నిర్మించిన భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం (ఐడిఎఫ్) గుర్తించింది. దానికి సంబంధించిన వీడియోను సైన్యం విడుదల చేసింది. కిలో మీటర్‌కు పైగా పొడవున ఆ సొరంగం సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సొరంగ నిర్మాణం కోసం దాదాపు 4500 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించి ఉంటారని ఐడిఎఫ్ అంచనా వేసింది. ఆ వీడియోను పంచుకున్న ఇజ్రాయెల్ సైన్యం అటువంటి సొరంగాలు ఎన్నిటినో ధ్వంసం చేసినట్లు తెలియజేసింది.

ఆ సొరంగంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు, తుపాకులు, రాకెట్ లాంచర్లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, ఇతర సామగ్రి ఉన్నట్లు ఐడిఎఫ్ తెలియజేసింది. దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హెజ్బొల్లా అటువంటి సొరంగాలను నిర్మించినట్లు సైన్యం తెలిపింది. మరొక వైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో నిరుడు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3186 మంది ప్రాణాలు కోల్పోయారు, 14078 మంది గాయపడ్డారు. శనివారం ఒక్క రోజే 53 మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News